Thamma Trailer | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో (Rashmika Mandanna) నటిస్తున్న హిందీ హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma). ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటిస్తుండగా.. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న ఐదవ చిత్రం. ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.