Pushpa 2 The Rule | పుష్ప 2 సినిమాతో ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం థాంక్యూ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించిన సందర్భంగా ప్రేక్షకులతో పాటు తన అభిమానులకు చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ వేడుకకు రష్మికకు మందన్నా హాజరుకాలేదు. తన కాలు ఫ్రాక్చర్ కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది. అయితే థాంక్యూ మీట్‌పై తాజాగా స్పందించింది రష్మిక.
నిన్న జరిగిన పుష్ప 2 థాంక్యూ మీట్‌కి నేను రాలేకపోయాను. కానీ ఈ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. సుకుమార్ సర్, అల్లు అర్జున్ సర్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు థాంక్యూ. మీరు చాలా కష్టపడి ఇలాంటి మాస్టర్ పీస్‌ను అందించినందుకు చాలా థాంక్స్. శ్రీవల్లి అనే పాత్రలో చెప్పాలి అంటే మీరెప్పుడు నా గుండెల్లో ఉంటారు. ఈ సినిమా కోసం అన్ని విభాగాలు చాలా కష్టపడడంతో పాటు అద్భుతంగా వర్క్ చేశాయి. ఈ జర్నీలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ రష్మిక రాసుకోచ్చింది.