మగవాళ్లలోనూ బ్రెస్ట్ క్యాన్సర్!
రొమ్ము క్యాన్సర్ గురించి వినని వాళ్లు ఉండకపోవచ్చు. క్యాన్సర్ బాధితులైన మహిళల్లో ఎక్కువ మందిని పీడించేది ఇదే.
రొమ్ము క్యాన్సర్ గురించి వినని వాళ్లు ఉండకపోవచ్చు. క్యాన్సర్ బాధితులైన మహిళల్లో ఎక్కువ మందిని పీడించేది ఇదే. కానీ, చాలామంది వినని ఇంకో మాట ఉంది. రొమ్ము క్యాన్సర్ మగవాళ్లకూ వస్తుంది. అయితే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ చాలా చాలా అరుదు. కానీ, అవగాహన ఉంటేనే అప్రమత్తంగా ఉంటారని, ఏ ఒక్కరూ క్యాన్సర్‌కి బలికారని వైద్యులు అంటున్నారు.
రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన లేక రొమ్ము భాగంలో వచ్చే మార్పుల్ని మహిళలు అనుమానించినంతగా మగవాళ్లు అనుమానించరు. కాబట్టి స్నానం చేసేప్పుడు ఛాతీపై రుద్దుకునేప్పుడు స్పర్శలో తేడా వస్తే కచ్చితంగా పరిశీలించుకోవడం మరచిపోవద్దు. పురుషుల్లోనూ బ్రెస్ట్ టిష్యూస్ ఉంటాయి. వాటిల్లో క్యాన్సర్ పుట్టే ప్రమాదం ఉంది. ఇది తీవ్రరూపం దాల్చకముందే తెలుసుకుంటే సురక్షితంగా బయటపడవచ్చు.
రొమ్ము భాగంలో చిన్న గడ్డ ఏర్పడుతున్నట్టుగా అనిపించినా, నిపిల్ ఎర్రగా మారినా, రక్తం లేదా నీరు కొద్దిగా బయటికి వచ్చినా, చంకలో గడ్డలు ఏర్పడినా జాగ్రత్తగా ఉండాలని సంకేతం వచ్చినట్టే. ఈ నాలుగు లక్షణాలు ఉంటే తప్పకుండా బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ప్రతి వాపునూ క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వాపుల్లో సాధారణమైనవే ఎక్కువగా ఉంటాయని, బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువేనని అంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

