పీరియడ్స్ డైట్
ఒత్తిడి, ఒంటరితనం, నిద్రలేమి వంటి కారణాలతో పీరియడ్స్ సైకిల్ మారిపోతున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫలానా ఆహారం తింటే సకాలంలో నెలసరి వస్తుందని ఎవరూ సలహా ఇవ్వలేరు.
ఒత్తిడి, ఒంటరితనం, నిద్రలేమి వంటి కారణాలతో పీరియడ్స్ సైకిల్ మారిపోతున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫలానా ఆహారం తింటే సకాలంలో నెలసరి వస్తుందని ఎవరూ సలహా ఇవ్వలేరు. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాలు పీరియడ్స్ సకాలంలో రావడానికి దోహదపడతాయని ఆహార నిపుణులంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాహారం అందితే హార్మోనల్ హెల్త్‌తో పాటు మెన్స్ట్రువల్ హెల్త్ కూడా సరిగా ఉంటుందట. పోషకాహార నిపుణుల సలహాల ప్రకారం… అయిదు రకాల ఆహారం తరచుగా తీసుకుంటే నెలసరి సరిగా ఉంటుందట.
అవేమిటంటే… బొప్పాయి, గుడ్లు, అవిసె గింజలు, దాల్చిన చెక్క, అల్లం. గుడ్డు, అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి సహజంగానే హార్మోన్ల సమతుల్యతకు దోహదపడతాయి. గుడ్డులో ఉండే అధిక పోషకాలు మెన్స్ట్రువల్ సమయంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. బొప్పాయిలో ఉండే లేటెక్స్, పపెయిన్ కండరాల స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. మెన్స్ట్రువల్ హెల్త్ కోసం వీటిని తప్పక తినాలన్న నియమం ఏమీ లేదు. కానీ, రోజూ తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడూ ఇవి కూడా ఉండేలా జాగ్రత్తపడితే మేలు!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

