స్పష్టమైన నిర్ణయాలేవి?
మొక్కుబడిగా తెలంగాణ,మహారాష్ట్ర సీఎంల సమావేశం.. ముందే ఊహించామన్న విశ్రాంత ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై ముంబైలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం మొకుబడిగా సాగిందని, స్పష్టమైన నిర్ణయాలేమీ లేకుండానే ఆ భేటీ ముగిసిందని విశ్రాంత ఇంజినీర్, నీటిరంగ నిపుణుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో జరిగిన ఈ సమావేశం చివరికి తుస్సుమన్నదని, ఇలా జరుగుతుందని ముందే ఊహించామని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై ఇంజినీర్లు, సెక్రటరీల కమిటీ అధ్యయనం చేస్తుందని, మహారాష్ట్ర ప్రజలకు ప్రతికూలంగా లేకపోతేనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. మహారాష్ట్రకు ప్రతికూలంగా ఉన్నందునే గతంలో ఆ బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు ఒప్పుకోలేదని, తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయాలు కూడా అధ్యయనం చేస్తారని అనడంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్ధా బరాజ్ ప్రాజెక్టును రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపిందని శ్రీధర్‌రావు దేశ్‌పాండే గుర్తుచేస్తూ.. వార్ధా బరాజ్ కంటే అత్యుత్తమ ప్రత్యామ్నాయం మరొకటి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వార్ధా బరాజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, తద్వారా వివాదాన్ని శాశ్వతం గా పరిషరించాలని ఆయన సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

