కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలా?
కాళేశ్వరం ప్రాజెక్టు భౌగోళిక స్వరూపం, ఇంజినీరింగ్ ప్రాథమిక సూత్రాలపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతటి పరిజ్ఞానం ఉన్నదో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం స్పష్టం చేసింది.
- కాంగ్రెస్ ఎంపీ చామల అజ్ఞానం బట్టబయలు
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు భౌగోళిక స్వరూపం, ఇంజినీరింగ్ ప్రాథమిక సూత్రాలపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతటి పరిజ్ఞానం ఉన్నదో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం స్పష్టం చేసింది. సోమవారం ప్రెస్మీట్లో కాళేశ్వరం మ్యాప్‌ను తన వెనుకాలే పెట్టుకొని కూర్చున్న ఎంపీ చామల.. ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌లు, బరాజ్‌ల ప్రాథమిక అనుసంధానంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడి నవ్వులపాలయ్యారు.
చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కన్నెపల్లి ఎత్తిపోతల నుంచి తోడి మేడిగడ్డలో పోయాలంటే దగ్గర దగ్గర 93.50 మీటర్ల నీళ్లు ఎత్తు ఉండాలి. అప్పుడు మాత్రమే కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు ఎత్తాలి’ అంటూ పదే పదే తప్పుడు ప్రకటనలు చేశారు.
వాస్తవం: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్) అనేది గోదావరిపై నిర్మించిన బరాజ్. కన్నెపల్లి వద్ద ఉన్నది లక్ష్మీ పంప్‌హౌస్. మేడిగడ్డ బరాజ్ వద్ద నిల్వ ఉన్న నీటిని.. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా గ్రావిటీ కెనాల్లోకి ఎత్తిపోసి, అకడి నుంచి అన్నారం (సరస్వతి) బరాజ్‌కు తరలిస్తారు. అంటే, నీటిని మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుల ద్వారా ముందుకు తరలిస్తారు తప్ప, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తి తెచ్చి మేడిగడ్డ బరాజ్‌లో పోయడం జరుగదు.
మేడిగడ్డ నుంచి అన్నారానికి పోతయా?
మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్లలో పోయాలన్నా సేమ్ మెజర్మెంట్ ఉండాలి’ అని చామల పేరొన్నారు. నిజానికి, మేడిగడ్డ బరాజ్ నుంచి అన్నారం బరాజ్‌కు నీరు నేరుగా గ్రావిటీ ద్వారా రివర్స్ వెళ్లదు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి పైపులైన్లు, కాలువల ద్వారా అన్నారానికి పంపిస్తారు. అలాగే అన్నారంలోని నీటిని సిరిపురం పంప్‌హౌస్ ద్వారా సుందిళ్లకు లిఫ్ట్ చేస్తారు. ఈ వ్యవస్థలన్నింటినీ కలుపుగోలుగా మాట్లాడుతూ, ప్రాజెక్టు నమూనాను తలకిందులు చేసి ప్రజలను అయోమయానికి గురిచేసేలా ఆయన చెప్పడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

