‘మ్యాట్రిక్స్ ప్రోటోకాల్’ ఏఐ హ్యాకథాన్‌లో అరుదైన ఘనత టాప్-10లో చోటు దక్కించుకున్న విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 20 : ఇండస్ట్రీ రెడీ శిక్షణ పొందుతున్న NIAT (NXTWAVE INSTITUTE OF ADVANCED TECHNOLOGIES) ఫస్ట్ ఇయర్ విద్యార్థుల బృందం, జాతీయ స్థాయిలో జరిగిన ‘ది మ్యాట్రిక్స్ ప్రోటోకల్స్’ AI హ్యాకథాన్ ఫైనల్ రౌండ్‌కి ఎంపికైన టాప్-10 టీమ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ 48 గంటల ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ స్ప్రింట్‌ను భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉన్న పియర్-టు-పియర్ లెండింగ్ ఫ్లాట్‌ఫారమ్ లెన్‌డెన్‌క్లబ్ ఆధ్వర్యంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో జూన్ 13 నుంచి 15 వరకు ముంబయిలో నిర్వహించారు. ఈ పోటీలో భాగంగా పాల్గొన్నవారు.. నిత్య ఆదాయం లేని వ్యక్తుల కోసం ఏఐ ఆధారిత క్రెడిట్ స్కోరింగ్ మోడల్స్ రూపొందించాల్సిన ఛాలెంజ్ ఎదురుకున్నారు. ఇది ప్రస్తుత ఫిన్‌టెక్ రంగంలో ఒక పెద్ద సమస్యగా పరిగణించబడుతోంది.
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు భారతదేశం నలుమూలల నుంచే కాదు, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీ, నేపాల్, పెరూ, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి కలిపి మొత్తం 1,800 మందికి పైగా పాల్గొన్నారు. ఆన్లైన్ రౌండ్ చాలా కఠినంగా ఉండటంతో, చివరికి టాప్ 150 సమస్య పరిష్కర్తలకు ముంబయిలో జరిగే ఆఫ్‌లైన్ ఫైనల్స్‌కి ఎంపిక చేశారు. వీరిలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఐఎస్ఐ లాంటి అగ్ర విద్యాసంస్థల విద్యార్థులతో పాటు.. కాగ్నిజెంట్, మోర్గాన్ స్టాన్లీ, టెక్ మహీంద్రా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిల్లా క్యాపిటల్, ఈఎక్సెఎల్, వొడాఫోన్ ఐడియా, ఒరాకిల్, జేపీ మోర్గాన్ చేస్, ఎంఎల్ ఎక్స్పర్ట్స్ ఏఐ. లాంటి దిగ్గజ సంస్థల టెక్నాలజీ నిపుణులు కూడా ఉన్నారు. ఇండస్ట్రీ రెడీ శిక్షణ పొందుతున్న NIAT విద్యార్థులు జాతీయ ఫిన్‌టెక్ హ్యాకథాన్‌లో తొలిసారిగా పాల్గొన్నారు. కానీ ఆ మొదటి ప్రయత్నమే గొప్ప విజయాన్ని అందించింది. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్స్ డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లతో పోటీపడి టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
NIAT ఫ్యాకల్టీ, అలుమ్నీ మెంటార్ల మార్గదర్శకత్వంలో విద్యార్థులు స్థిరమైన ఆదాయం లేని వ్యక్తుల కోసం వారి ఆదాయాన్ని అంచనా వేసే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మోడల్ తయారు చేశారు. ఇది వారికి రీపేమెంట్ క్రెడిట్ స్కోర్‌ని జెనరేట్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఆధారంగా బ్యాంకులు, సంస్థలు త్వరగా రుణ నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. “జాతీయ హ్యాకథాన్‌లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు అసలు అవకాశం ఉంటుందా? అనేదే మాకు మొదట్లో సందేహంగా అనిపించింది. కానీ ఫైనల్ డెమో జరిగే సమయానికి ఇండస్ట్రీ మెంటార్లు మా కోడ్ చూడాలని అడగడం మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది.” అంటున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థి వేగా దర్శి.
నెక్స్ట్ వేవ్ మరియు NIAT సీఈఓ & కో-ఫౌండర్ రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ.. “ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు అనుభవజ్ఞులతో పోటిపడి జాతీయ స్థాయిలో టాప్-10లో నిలవడం అనేది NIAT ట్రైనింగ్, మెంటార్ షిప్ యువతలో అగ్రశ్రేణి నైపుణ్యాలను ఎంత త్వరగా అభివృద్ధి చేయగలదో చూపించే బలమైన ధృవీకరణ,” అని తెలిపారు.
భవిష్యత్తును ఎదుర్కొనేందుకు మాత్రమే సన్నద్ధపరచకుండా వారు భవిష్యత్తుకు నాయకత్వం వహించేలా విద్యార్థులను సిద్ధం చేస్తుంది NIAT. ‘ది మ్యాట్రిక్స్ ప్రోటోకల్స్’లో టాప్-10లో స్థానం దక్కించుకోవడం అనేది విద్యార్థుల నేతృత్వంలోని విజయాలు పెరుగుతున్న జాబితాలో చేరుకుంది. ఇప్పటికే NIAT ఇండస్ట్రీ రెడీ శిక్షణ పొందుతున్న విద్యార్థులు ముంబై టెక్ వీక్‌లో వారి నైపుణ్యం నిరూపించుకున్నారు, టి-హబ్‌లో జరిగిన బిజినెస్ హ్యాకథాన్‌లో విజయంతో పాటు పలు హ్యాకథాన్లలో విజయం సాధించారు అంటూ NIAT వెల్లడించింది.