చండీగఢ్, ఫిబ్రవరి 7: పంజాబ్‌లో ఎన్నికల వేళ హర్యానాలోని బీజేపీ సర్కారు వివాదాస్పద చర్యకు పూనుకొన్నది. ఇద్దరు సాధ్విలపై లైంగిక దాడి కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా రామ్ రహీమ్ సింగ్‌ను పెరోల్‌పై విడుదల చేసింది. ఆయన 21 రోజులు జైలు బయటే గడపనున్నారు. పంజాబ్‌లో 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డేరా బాబాకు పంజాబ్‌లో దాదాపు 40 లక్షల మంది భక్తులున్నారు. మాల్వా ప్రాంతంలో పట్టు ఉంది. భటిం డా, సంగ్రూర్, పాటియాలా, ముక్త్సర్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరు.
ఈ నేపథ్యంలో వారి ఓట్ల కోసమే డేరా బాబాను బీజేపీ జైలు నుంచి విడుదల చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. డేరా బాబా విడుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నా రు. జైలు మాన్యువల్ ప్రకారమే డేరా బాబాకు బెయిల్ ఇచ్చినట్టు జైళ్ల మంత్రి రంజిత్ చౌతాలా పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో గడపడానికే పెరోల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.