Ranveer Singh Kantara | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ‘కాంతార’ వివాదంపై క్షమాపణలు తెలిపాడు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో రణ్వీర్ సింగ్‌తో పాటు రిషబ్ శెట్టి పాల్గోనగా.. ఈ వేడుకలో రిషబ్‌ను ఉద్దేశించి రణ్వీర్ మాట్లాడుతూ.. కాంతార చిత్రంలో మీరు అద్భుతంగా నటించాడని తెలిపాడు. ముఖ్యంగా హీరోలో దెయ్యం(పంజుర్లీ దేవత) ప్రవేశించిన సన్నివేశాలు అదిరిపోయాయని కొనియాడాడు. అయితే పంజుర్లీ దేవతను దెయ్యం అని సంబోధించడంపై కన్నడిగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే ఈవెంట్లో అత్యంత పవిత్రంగా భావించే కాంతారలోని “ఓం…” అనే గర్జనను రణ్వీర్ హాస్యంగా అనుకరించి చూపించాడు. దీన్ని చూసిన కన్నడ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అది మా సంస్కృతి, మా ఆరాధనలో భాగం… దాన్ని జోక్‌గా తీసుకోవడం సరికాదని రణ్‌వీర్‌పై విరుచుకుపడుతున్నారు. చాలా మంది కన్నడిగులు రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై రణ్వీర్ సింగ్ క్షమాపణలు తెలిపాడు.
ఈ వివాదం తీవ్రం కావడంతో రణ్వీర్ సింగ్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. నా ఉద్దేశం కేవలం రిషబ్ శెట్టి అద్భుతమైన ప్రదర్శనను హైలైట్ చేయడమే. నటుడిగా, ఆ సన్నివేశాన్ని ఆయన ప్రదర్శించిన తీరుకు ఎంత కష్టపడతారో నాకు తెలుసు, అందుకే ఆయనపై నాకు ఎంతో గౌరవం ఉంది. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా చర్యల వలన ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నేను నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నాను అంటూ రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.