పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎంగా ఐదోసారి ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కే కైలాసనాథన్ ఆయనతోపాటు నూతన మంత్రులలో పదవీ ప్రమాణం చేయించారు.
ముఖ్యమంత్రితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఎం నమశ్శివాయం, ఆర్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్(ఏఐఎన్ఆర్సీ) ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవిని ఐదుసార్లు చేపట్టిన తొలి నాయకునిగా రంగస్వామి రికార్డు నెలకొల్పారు.