పరిగి, మార్చి 15 : 12 నుంచి 14 సంవత్సరాలలోపు వయసువారికి బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ వేయడం ప్రారంభమవుతుంది. పిల్లలకు వ్యాక్సిన్‌ను వారి తల్లిదండ్రుల సమక్షంలో వేయాలని, వ్యాక్సిన్ వేసిన తర్వాత 30 నిమిషాలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిధిలో 12 నుంచి 14 ఏండ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో 25,713 మంది ఉన్నారు. 25 సర్కారు దవాఖానల్లో బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి 14వేల డోసుల కోర్బివాక్స్ వ్యాక్సిన్ జిల్లాకు చేరుకుంది. అవసరంమేరకు మరింత వ్యాక్సిన్‌ను తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇదిలావుండగా ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలో మొదటి డోసు కొవిడ్ వ్యాక్సిన్ 7,59,408 మందికి, రెండో డోసు 6,87,705 మందికి, ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ 6,168 మందికి వేశారు.
ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు సన్మానం
జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో టీకాల కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశ వర్కర్లను సన్మానించనున్నారు. ప్రశంసాపత్రం కూడా అందజేస్తారు. ఈమేరకు ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి జాబితా తయారు చేయాల్సిందిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాంభట్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను ఆదేశించారు.
నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్
జిల్లా వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి
ఇబ్రహీంపట్నం, మార్చి 15 : 12 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాం. బుధవారం నుంచి జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో 12 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు వ్యాక్సినేషన్‌ను శిక్షణ పొందిన సిబ్బందిచే అందించనున్నాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తమ విధులను సమర్థవంతగా నిర్వహించి వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలి. దీనిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం.
వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవారీగా 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలు
పీహెచ్సీ :పిల్లలు
సిద్దులూరు :840
రామయ్యగూడ : 1745
చన్గోముల్ : 722
నవాబుపేట్ : 1087
పూడూరు : 591
చిట్యాల్ : 1921
దోమ : 1350
కులకచర్ల : 1482
పట్లూర్ : 1279
బంట్వారం : 974
మోమిన్‌పేట్ : 1135
నాగసముందర్ : 624
ధారూరు :652
పెద్దేముల్ : 1410
జిన్గుర్తి :1395
నవాల్గా :655
బషీరాబాద్ :695
యాలాల :1180
బొంరాస్‌పేట్ ;1333
అంగడిరాయచూర్ :1442
దౌల్తాబాద్ :1444
పీపీ యూనిట్ తాండూరు: 1758