కడ్తాల్, మార్చి 15 : మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో కొలువైన వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయాన్ని మామిడాకు, కొబ్బరి, అరటి ఆకుల తోరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత స్వా మి వారిని శుద్ధజలం, పంచామృతాలతో అభిషేకించి, ఆలయ అర్చకులు శ్రీమాన్ తిరుమల రామానుజాచార్యులు, ఆదిత్యాచార్యులు, చిదంబరశర్మ, క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. వివిధ రంగుల పూలమాలలతో శ్రీదేవి, భూదేవితోపాటు, శ్రీవారి ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు.
ఆలయ ధర్మకర్త పుట్టపాక రాంచందర్‌రావు పట్టు వస్ర్తాలు, పుస్తె మెట్టెలు అందజేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ ఆవరణలో కురుమ, యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ, ఎంపీటీసీ బొప్పిడి గోపాల్, ఉప సర్పంచ్ వెంకటేశ్, ఏంఈవో సర్దార్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠలయ్యగౌడ్, ఉపాధ్యక్షులు రంగయ్య, రవీందర్, రాములు, బీరప్ప, మహేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, యాదయ్య, వసం త, బాలకృష్ణ, రమేశ్‌యాదవ్, రవికుమార్ పాల్గొన్నారు.