పెద్దఅంబర్‌పేట , మార్చి 13 : నియోజక వర్గంలోని ఇంటింటికీ నీరందించడమే లక్ష్యంగా ముందకెళ్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 23వ వార్డులో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల వరకు తాగునీటి సమస్యలు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
నియోజకవర్గంలోని తుర్కయాంజాల్‌లో రూ. 92 కోట్లతో, పెద్దఅంబర్‌పేటలో రూ. 46 కోట్లతో, ఆదిబట్లలో రూ.18 కోట్లతో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టామన్నారు. ప్రతి ఇంటికీ నీరందించేందుకు అధికారులతో చర్చించామన్నారు. మొత్తంగా 150 కిలో మీటర్ల పొడవుతో పైపులైన్ పనులు చేపట్టామన్నారు. ప్రతి కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఓఆర్ఆర్ లోపల తాగునీటి సమస్యలు లేకుండా చేయాలని కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
అనంతరం మైత్రి కుటీర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కమిషనర్ అమరేందర్‌రెడ్డి, బలరాం,, సత్యనారాయణరెడ్డి, రేణుక, దామోదర్, విజయేందర్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.