షాద్‌నగర్‌టౌన్, మార్చి 28 : ప్రజల అవసరాల దృష్ట్యా షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఆధునిక హంగులతో మోడల్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో సోమవారం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కవితతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్, చేపలతోపాటు అన్ని వస్తువులు ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా రూ.4.50కోట్లతో ఈ మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. సకల సౌకర్యాలతో అత్యాధునికమైన మోడల్ మార్కెట్ అందుబాటులోకి రానుందన్నారు. మోడల్ మార్కెట్లో నాణ్యమైన వస్తువులతో పాటు ధరలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై ఆరె కటిక సంఘం నాయకులు, హమాలీలు ఎమ్మెల్యేను సన్మానించారు. అంతకుముందు భూమి పూజ చేయడంతోపాటు బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మోడల్ మార్కెట్ నమూనాను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, మాజీ చైర్మన్ విశ్వం, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు నారాయణరెడ్డి, శంకర్, శేఖర్, నారాయణ, నర్సింహులు, జమృత్, యాదగిరి, సుధాకర్, గోపాల్, శరత్ ఉన్నారు.
దైవచింతన అలవర్చుకోవాలి
కొందుర్గు, మార్చి 28 : సమాజంలో ప్రతిఒక్కరూ దైవచింతన అలర్చుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం శ్రీరంగాపూర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన, గంగన్నగూడ గ్రామంలో బీరప్ప బోనాల కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవాలన్నారు.