షాద్‌నగర్, మార్చి21: ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆకాంక్షించారు. ఆయన కూతురు జ్యోతి జ్ఞాపకార్థం షాద్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ భవన ఆవరణలో ఏర్పాటుచేసిన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ 90వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల విద్యార్థులు ఉచిత శిక్షణ తరగతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు గ్రూప్ 2, 3, 4, ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు శిక్షణ ఇస్తారని, ఉచితంగా సంబంధిత పుస్తకాలను అందిస్తారని వివరించారు.
ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కె. నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, నాయకులు లక్ష్మణ్‌నాయక్, యుగేందర్, ప్రతాప్‌రెడ్డి, కానుగు అంతయ్య, మన్నె నారాయణ, జూపల్లి శంకర్, కిశోర్, దేవేందర్‌యాదవ్, శరత్, అశోక్, గుడ్డుయాదవ్, నవీన్, శ్రీకాంత్, శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.