e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News ప్రభంజనం సృష్టించాలి

ప్రభంజనం సృష్టించాలి

  • విజయగర్జనకు భారీగా తరలిరావాలి
  • గ్రామాల్లో ప్రజలకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచాలి
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
  • చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం
  • హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

షాబాద్‌, అక్టోబర్‌28: మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్‌లో ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. ఒక్కడిగా మొదలైన ఉద్యమ పార్టీ…నేడు తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడ మే కాకుండా తొమ్మిదోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్‌కు మనమందరం అండగా ఉండాలని సూచించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన మొదటి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మూడేండ్లలోనే పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత మన సీఎంకే దక్కిందన్నారు. ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం సాధించినప్రగతి దేశానికే మార్గదర్శకమన్నారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు వంటి పథకాలను ప్రవేశపెట్టి రా ష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే పంజాబ్‌ ను తలదన్నెలా నేడు తెలంగాణ రాష్ట్రం ముందుకు దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో త్వరలో మొదటి విడతగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొ ప్పున ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదన్నారు. నవంబర్‌ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ విజయగర్జన సభకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పభంజనం సృష్టించాలని ఆమె సూచించారు.
అనంతరం సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నా రు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు అనునిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన విజయగర్జనకు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 164 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో కలిపి 179 బస్సుల్లో ప్రతి బస్సుకూ 50 మంది చొప్పున తరలిరావాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి, ఆయా మండలాల ఎం పీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, కాలె భవాని, గునుగుర్తి నక్షత్రం, గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీలు మర్పల్లి మాల తి, కాలె జయమ్మ, పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్‌, గోవిందమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి, పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్‌, గూడూర్‌ నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, గోపాల్‌, నాగిరెడ్డి, వాసుదేవ్‌కన్నా, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు శివనీల, స్వప్న, బుచ్చిరెడ్డి, వైస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, మహిళా అధ్యక్షురాలు మిట్ట లత, యూత్‌ అధ్యక్షుడు శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, బాల్‌రాజ్‌, పోలీసు రాంరెడ్డి, చల్లా శేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, రంగారెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్‌, నాగార్జునరెడ్డి, రాంరెడ్డి, కృష్ణ, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

- Advertisement -

చేవెళ్లటౌన్‌, అక్టోబర్‌ 28: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అ న్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సబితారెడ్డి, వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలో శంకర్‌పల్లి మం డల కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌, నవాబ్‌పేట్‌, చేవెళ్ల మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

బాలికల ఉన్నత పాఠశాల సందర్శన

పరిగి టౌన్‌, అక్టోబర్‌ 28: పరిగి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను గురువారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సందర్శించారు. ఈ సం దర్భంగా ఆమె తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాల ప్రహరీ శిథిలావస్థకు చేరిందని కొత్తగా నిర్మించాలని హెడ్‌మాస్టర్‌ కృష్ణారెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పరిగి, చెవేళ్ల ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌కుమార్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ సురేందర్‌కుమార్‌, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement