రెండుమూడేళ్లలో దర్శకత్వం
ఇటీవలే ‘రామాయణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్‌కపూర్.
- పదేళ్లు మాత్రమే నటుడిగా కొనసాగుతా
ఇటీవలే ‘రామాయణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్‌కపూర్. శ్రీరాముడి పాత్రలో ఆయన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మరో పదేళ్లపాటు మాత్రమే నటుడిగా కొనసాగుతానని, రాబోయే రెండుమూడేళ్లలో దర్శకుడిగా తన కలను నెరవేర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దర్శకత్వం కోసం కథలు రాయడం ప్రారంభించానని తెలిపారు.
‘రెండు నెలల క్రితమే కథ రాయడం మొదలుపెట్టా. ఈ క్రమంలో రచయితలపై ఎంతో గౌరవం పెరిగింది. ఒక కథను సృష్టించడం అంత సులభం కాదని అర్థమైంది. స్వరకర్తల తర్వాత అంత గొప్ప సృజనాత్మక సంతృప్తి అనుభవించేది దర్శకుడే అనుకుంటున్నా. దర్శకుడిగా తొలిప్రయత్నంలో ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించాలనుకుంటున్నా’ అని రణబీర్‌కపూర్ చెప్పారు. నటుడిగా రాబోవు దశాబ్దం తనకు చివరిదని, ఏడాదిలో కేవలం వందరోజులు మాత్రమే సినిమాలకు కేటాయిస్తానని, మిగతా సమయాన్ని కథలు రాసుకునేందుకు కేటాయిస్తానని రణబీర్‌కపూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

