సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
తాను చదువుతున్న కళాశాల లెక్చరర్, ప్రిన్సిపాల్ సెల్ ఫోన్ లాక్కుని వేధించడంతో మానసిక వేదనకు గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
వెంగళరావునగర్, నవంబర్ 7 : తాను చదువుతున్న కళాశాల లెక్చరర్, ప్రిన్సిపాల్ సెల్ ఫోన్ లాక్కుని వేధించడంతో మానసిక వేదనకు గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన కట్టా భాను ప్రసాద్ రెడ్డి(20) బల్కంపేటలోని చెన్నైస్ అమ్రిత హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మరికొందరు మిత్రులతో కలిసి ఎస్ఆర్నగర్ లోని ఓ గదిలో అద్దెకుంటున్నాడు.
వారం రోజుల కిందట కళాశాల లెక్చరర్ భాస్కర్ ఫొటోను ఏఐతో మార్ఫింగ్ చేసి స్నేహితుడు శేఖర్‌కు పంపించాడు. ఆ చిత్రాన్ని శేఖర్ కూడా సరదాగానే లెక్చరర్‌కు చూపాడు. తన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కోపోద్రిక్తుడైన లెక్చరర్ భాస్కర్.. కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ భాను ప్రసాద్ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించడంతో పాటు సెల్‌ఫోన్ లాక్కున్నాడు. తల్లిదండ్రులను కళాశాలకు పిలిపిస్తేనే ఫోన్ అప్పగిస్తానని చెప్పాడు. అయితే జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నందున సెల్ ఫోన్ లేకపోతే ఇబ్బంది పడతానని.. వేడుకున్నా..
వినలేదు. విషయాన్ని విద్యార్థి తన సోదరుడు ప్రవీణ్ రెడ్డికి చెప్పాడు. గురువారం కళాశాలకు వచ్చిన ప్రవీణ్‌రెడ్డి లెక్చరర్‌తో పాటు ప్రిన్సిపాల్‌తో మాట్లాడాడు. తన సోదరుడు పొరపాటు చేశాడని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చాడు. అయినా ప్రిన్సిపాల్ సెల్ ఫోన్‌ను తిరిగి ఇవ్వలేదు. మరుసటి రోజు శుక్రవారం రోజు రాత్రి తానుంటున్న గదికి వెళ్లిన భాను ప్రసాద్ రెడ్డి..లోపలి నుంచి గడియ పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతడి మరో స్నేహితుడైన నూతన్ రాత్రి వెళ్లి కిటికీలో నుంచి చూసి భాను ప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించాడు. మృతుడి సోదరుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, లెక్చరర్, ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కళాశాల ముందు బైఠాయించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్, లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కళాశాల లెక్చరర్ భాస్కర్, ప్రిన్సిపాల్ చంద్రమోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

