ముంబై: బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరూ రేపు మ్యారేజ్ చేసుకోనున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే ముంబైలో స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మెహిందీ సెర్మనీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని పాలీ హిల్స్‌లో ఉన్న వాస్తూ బిల్డింగ్‌లో ఈ వేడుకు జరుగుతుంది. చాలా గోప్యంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. కేవలం ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఈ ఈవెంట్‌కు హాజరవుతున్నారు. రణ్‌బీర్, ఆలియాతో సన్నిహితంగా ఉండే మిత్రులకు మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వాస్తూ బిల్డింగ్‌లోనే రణ్‌బీర్, ఆలియాలు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.