దగ్గుబాటి హీరో రానా నటించిన తాజా చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ హిందీలో హాథీ మేరే సాథీ, తమిళంలో కాదన్, తెలుగులో ‘అరణ్య’ అనే టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది. యానిమల్ కాన్ఫ్లిక్ట్ కథాంశంతో.. ఏనుగులు, అడవి నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కించారు. మార్చి 26న చిత్రాన్ని మూడు భాషలలో విడుదల చేయాలని మేకర్స్ భావించగా, కరోనా వలన హిందీ రిలీజ్ వాయిదా పడింది.
అరణ్య చిత్రం ఏనుగుల నేపథ్యంలో తెరకెక్కగా, మూవీ ప్రమోషన్స్ కూడా అదే పంథాలో సాగుతున్నాయి. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహంచగా, ఆ ప్రాంతం అంతా అడవిలా మార్చి ఆశ్చర్యపరిచారు. ఇక యంగ్ హీరో నాగశౌర్యకు రానా ..ఏనుగుల బొమ్మలకు సంబంధించిన బహుమతులు పంపాడు. ఈ బహుమతి అందుకున్న నాగశౌర్య .. రానాకు శుభాకాంక్షలు తెలిపారు శౌర్య. ‘‘వ్యక్తిగతంగా గిఫ్ట్స్ పంపినందుకు థాంక్యూ రానా. అరణ్య ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమాలో మీ నటన సినిమా పట్ల మీ అంకిత భావం చాలా గొప్పది. బాక్సాఫీస్ వద్ద రాకింగ్ చేస్తారు. సినిమా చూడ్డానికి వెయిట్ చేయలేకపోతున్నాను’అంటూ ట్వీట్ చేశారు శౌర్య.
Thank you for these Personalised gifts @RanaDaggubati garu 🤗
— Naga Shaurya (@IamNagashaurya) March 24, 2021
Trailer of #Aranya is amazing, your performance and dedication towards the movie is Marvellous. Can’t wait to watch the movie in theaters. Surely you will rock at Box office as always. 😊👍 #Aranyaon26thmarch pic.twitter.com/P27WivW8ve