గోదావరిఖని, జనవరి 6 : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్య మ చరిత్రమాదనీ, రాజకీయాల్లో మాలాంటి వారి కి ఎందరికో స్ఫూర్తి ప్రదాత మంత్రి కొప్పుల ఈశ్వర్‌పైన, తనపైన గోనె ప్రకాశ్‌రావు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక క్యాంపు కా ర్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. గోనె ప్రకాశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మచ్చలేని నాయకుడని, రామగుండం ప్రజలకు నిత్యం సేవ చేసేందుకు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నామన్నారు. ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకుంటున్నామని మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమని, గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటామన్నారు.
మంత్రిపై మరోసారి ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, కా ర్పొరేటర్లు ధాతు శ్రీనివాస్, ఇంజపురి పులెందర్, పెంట రాజేశ్, కుమ్మరి శ్రీనివాస్, సాగంటి శంకర్, రమణారెడ్డి, బాల రాజ్‌కుమార్, కో-ఆప్షన్ సభ్యు లు వంగ శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బొడ్డు రవీందర్, రాకం వేణు, రామస్వామి, జెవి రాజు, వేగోలపు శ్రీనివా స్, సంజీవ్, జాహిద్ పాషా, మారుతి, బాలరాజు, నూతి తిరుపతి, తోకల రమేశ్, చిలుముల విజ య్,గడ్డికనుకయ్య,శ్రీనివాస్, క్రాంతి ఉన్నారు.