Ram Gopal Varma | ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఏపీ పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల కారణంగా రామ్ గోపాల్ వర్మని ఒంగోలు పోలీసులకు విచారణకు పిలిచారు. ఈ విచారణలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లు చెల్లింపులు చేయడంపై పోలీసులు విచారించారు. అయితే ఈ విచారణలో పోలీసులకి వర్మ సహకరించకపోవడంతో అతడి ఫోన్ని సీజ్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే హైకోర్టు ఆర్జీవీని విడుదల చేయాలని పోలీసులని ఆదేశించగా.. ఇద్దరి పూచికత్తుతో ఆర్జీవీని విడుదల చేశారు.