బాక్సాఫీస్ విజయమే ప్రతిభకు ప్రామాణికం కాదని, ఓ నటిగా వినూత్న కథాంశాల్లో భాగమవుతూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడమే తన లక్ష్యమని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా సినిమాలు ప్రతి ఒక్కరికి చేరువవుతున్నాయని ఆమె అభిప్రాయపడింది. ఆమె మాట్లాడుతూ ‘గత ఏడాది కాలంగా నేను నటించిన చిత్రాలు థియేటర్‌తో పాటు ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. రన్‌వే 34, డాక్టర్ జీ, ఛత్రీవాలీ కథలు చాలా కొత్తగా ఉన్నాయని, నా నటన కూడా వైవిధ్యంగా ఉందని ప్రశంసలొచ్చాయి. ఆ సినిమాలు ఎంత వసూలు చేసాయనే లెక్కల్ని నేను పట్టించుకోను. ఓ నటిగా ప్రేక్షకులకు వినూత్న కథాంశాల్ని అందించాననే సంతృప్తి ఉంటే చాలు’ అని పేర్కొంది. ‘కొండపొలం’ తర్వాత తెలుగు చిత్రసీమకు దూరంగా ఉంటూ పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టిపెట్టింది రకుల్‌ప్రీత్‌సింగ్.