Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
Rajinikanth | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా సంచలన చిత్రం 'డోరతి'పై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.
Rajinikanth | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా సంచలన చిత్రం ‘డోరతి’పై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చూసి ఫిదా అయిన తలైవా.. స్వయంగా దర్శకుడితో పాటు నటులను ఆహ్వానించి సుమారు గంటపాటు చిత్ర విశేషాలపై ముచ్చటించారు. రజినీ నుంచి వచ్చిన ఈ అనూహ్య ప్రశంసలతో కార్తీక్ సుబ్బరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన భేటీకి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సనత్, రిషికాంత్ కీలక పాత్రలు పోషించారు. సినిమా వీక్షించిన అనంతరం రజినీకాంత్ ప్రతి అంశాన్ని పరిశీలించి అభినందించారని కార్తీక్ తెలిపారు. “తలైవా… ఫాంటాస్టిక్, బ్యూటిఫుల్, మైండ్‌బ్లోయింగ్!” అంటూ రజినీ రియాక్షన్‌ను ఆయన ఉత్సాహంగా పంచుకున్నారు. ముఖ్యంగా, “నాకు కావలసిన కార్తీక్ సుబ్బరాజ్ ఇతనే” అంటూ తలైవా కొనియాడిన మాటలు తన జీవితంలో ఎప్పటికీ మరువలేని మధుర జ్ఞాపకమని కార్తీక్ భావోద్వేగంతో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

