యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నార్సింగి డివిజన్‌కు చెందిన రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దుడ్డు ఆకాశ్ తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్‌రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు.
మణికొండ,అక్టోబర్ 14 : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నార్సింగి డివిజన్‌కు చెందిన రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దుడ్డు ఆకాశ్ తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్‌రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్బంగా ఆకాశ్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పాటుపడే సబితాఇంద్రారెడ్డి నేతృత్వంలో పనిచేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని వీడినట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో యువకులకు సరైన గుర్తింపు లేదని, దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించిన నాయకులకు అధిష్ఠానం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత, బడుగుల ఆశాజ్యోతి కార్తిక్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతామని ఆకాశ్ చెప్పారు. త్వరలోనే నార్సింగి నుంచి ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ఆకాష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సంతోష్ నాయుడు, రాజేశ్‌లతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

