వాషింగ్టన్: ఇండియన్ అమెరికన్, తెలంగాణ మూలాలున్న రాజాచారికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి రాజాచారిని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు. అయితే ఈ నియామకం సెనెట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో బ్రిగేడియర్ జనరల్ అనేది వన్ స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంక్ హోదా. మేజర్ జనరల్ హోదా తర్వాతి స్థానం ఇది. ప్రస్తుతం రాజాచారి అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్టేషన్‌లో క్రూ-3 కమాండర్‌గా, వ్యోమగామిగా సేవలందిస్తున్నారు. నలుగురు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్‌కు రాజాచారి కమాండర్‌గా వ్యవహరించారు. కొన్ని నెలల పాటు ఆయన ఈ బృందంతో కలిసి అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు జరిపి గత ఏడాది మేలో భూమిపైకి తిరిగొచ్చారు.