ముంబై: ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలన్నీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాయి. తాజా వేలంలో అనూహ్య నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురువారం ప్రాక్టీస్ మొదలెట్టాడు. సహాయక సిబ్బందితో కలిసి మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. మరోవైపు రైజర్స్ బౌలింగ్ కోచ్, దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం స్టెయిన్ జట్టుతో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న స్టెయిన్.. టామ్ మూడీ, బ్రియన్ లారా, ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి సన్‌రైజర్స్‌ను పటిష్టం చేయనున్నాడు.