హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, చింతలకుంట, వనస్థలీపురం, హయత్నగర్, సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్పల్లి మోస్తరు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్లో కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.