హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, తౌటే తుఫాను ప్రభావం లేదని పేర్కొంది. దక్షిణ దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 20వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, జగిత్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, కరీంనగర్, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, వనపర్తి, నారాయణపేట, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.