హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్‌జిల్లాల చాంపియన్‌షిప్‌లో సీ రాహుల్.. మిస్టర్ తెలంగాణ టైటిల్ విజేతగా నిలిచాడు. నగరంలోని హనుమాన్ వ్యాయామశాల వేదికగా జరిగిన పోటీల్లో పది విభాగాల్లో 200మందికి పైగా బాడీ బిల్డర్లు పోటీపడ్డారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాహుల్‌కు ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని ప్రముఖ సినీ నటుడు శరత్‌కుమార్ అందించారు. వేర్వేరు విభాగాల్లో విజేతలుగా నిలిచిన వాళ్లు సీనియర్ మిస్టర్ ఇండియా టోర్నీలో రాష్ట్రం తరఫున పోటీకి దిగనున్నారు.
విజేతలు వీరే: చాంపియన్ ఆఫ్ చాంపియన్స్(రాహుల్), సయ్యద్ రెహమాన్(55కి), జాన్ బుష్(60కి), అదిల్(65కి), రోనిక్ కాంత్(70కి), మన్సూర్షా(75కి), రాహుల్(80కి), అక్బర్(85కి), అలీ(90కి), యూసుఫ్(95కి), బసంత్‌సింగ్(100కి).