గోవా నేపథ్యంలో రొమాన్స్
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పకురాలు. కోటి ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పీ ప్లిక్స్ స్టూడియోస్ పతాకాలపై ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. తన తల్లి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న చిత్రంలో నటించడం ప్రత్యేకంగా భావిస్తున్నానని మేఘా ఆకాష్ ఆనందం వ్యక్తం చేసింది. కొత్త కాన్సెప్ట్ ఇదని..రొమాంటిక్ ఎంటర్టైనర్గా అలరిస్తుందని హీరో రాహుల్ విజయ్ చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘గోవా బ్యాక్డ్రాప్లో నడిచే కథ ఇది. హైదరాబాద్, గోవాల్లో చిత్రీకరణ జరిపి 25రోజుల్లో సినిమాను పూర్తిచేస్తాం’ అన్నారు. అర్జున్ కల్యాణ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కథ: ఏ.సుశాంత్రెడ్డి, దర్శకత్వం: అభిమన్యు బద్ది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

