దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు రావడం వెనక వారి చర్మవర్ణమే కారణమని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అభిప్రాయపడింది.
దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు రావడం వెనక వారి చర్మవర్ణమే కారణమని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అభిప్రాయపడింది. దక్షిణాది తారలు అందంతో పాటు అద్భుతమైన ప్రతిభాపాటవాలతో ఉంటారని, వారిని కాదని ఉత్తరాది వారిని ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారని ప్రశ్నించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే తన అభిప్రాయం పూర్తిగా నిజం కాకపోవచ్చునని ఆమె పేర్కొన్నది.
‘నార్త్ హీరోయిన్లు బాగా తెల్లగా ఉంటారనే కారణంతో దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు వస్తాయని అనిపించేది. నా కలర్ కొంచెం నలుపు. అందుకే సౌత్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదేమో. అయితే ఈ విషయంలో వివాదం సృష్టించడం నా ఉద్దేశ్యం కాదు. దక్షిణాది హీరోయిన్లు అద్భుతమైన ప్రతిభావంతులు. అన్ని భాషలను మాట్లాడగలుగుతారు. ముంబయి నుంచి నటీనటులను తీసుకొచ్చి వారి పాత్రలకు డబ్బింగ్ చెప్పించడం కంటే దక్షిణాది వారికే అవకాశాలు ఇవ్వడం మంచిదన్నది నా అభిప్రాయం’ అని రాధికా ఆప్టే చెప్పింది. భాష రాకపోతే పాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేమని ఆమె అభిప్రాయపడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

