టోక్యో: క్వాడ్ దేశాలు ఇవాళ క్వాడ్ ఫెలోషిప్‌ను ప్రకటించాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. క్వాడ్ ఫెలోషిప్ పొందే విద్యార్థులు అమెరికాలో చదువుకోవచ్చు. అయితే ఈ నాలుగు దేశాలకు చెందిన వంద మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా విద్యార్థులకు స్పాన్సర్షిప్ ఇస్తారు. గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లను విద్యార్థులు పూర్తి చేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. క్వాడ్ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని భారతీయ విద్యార్థులను ప్రధాని మోదీ కోరారు.
“I encourage our students to apply for the Quad Fellowship programme and join the next generation of STEM leaders and innovators building a better future for humanity”
A message from PM @narendramodi on the Quad Fellowship. pic.twitter.com/bEL8aYjOIs
— Arindam Bagchi (@MEAIndia) May 24, 2022
జూన్ 30వ తేదీ వరకు ఫెలోషిప్ దరఖాస్తులను స్వీకరిస్తారు. 2023 సీజన్లో ఆ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు.. ముందుగా క్వాడ్ ఫెలోషిప్ వెబ్సైట్లో తమ అర్హతల గురించి రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తును నింపాలి. అయితే ఇంకా ఆ దరఖాస్తులను ఆన్లైన్లో రిలీజ్ చేయలేదు. రెజ్యూమ్, ట్రాన్స్‌స్క్రిప్ట్, రికమెండేషన్ లెటర్లు అన్నీ ఇంగ్లీష్‌లో నింపాల్సి ఉంటుంది. జూలైలో రిలీజయ్యే నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఈ ఫెలోషిప్‌కు అర్హులు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలో నివాసితులై ఉండాలి. బ్యాచలర్స్ డిగ్రీ లేదా 2023 ఆగస్టు నాటికి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో సమాన విద్యార్హత ఉండాలి. అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో అకాడమిక్స్‌లో అద్భుత ఘనత సాధించి ఉండాలి. మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేస్తున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 30వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. జూలై-అక్టోబర్ 2022లో దరఖాస్తులను పరిశీలిస్తారు. అక్టోబర్‌లో క్వాడ్ ఫెల్లోస్ సెలక్షన్ జరుగుతుంది. ప్రీ ఫెల్లోషిప్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది. ఆగస్టు 2023లో ఫెల్లోషిప్ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది. 2024 సమ్మర్లో సీనియర్ ఫెల్లో షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.