భళా సింధు
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ సిరీస్‌లో పీవీ సింధు తొలిరౌండ్ అదరగొట్టింది. మహిళల సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో సింధు 21-14, 8-21, 23-21తో థాయ్‌లాండ్ షట్లర్ సుపనిద కేట్థాంగ్పై గెలిచి రెండో రౌండ్‌కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ గంటకు పైగా సాగిన పోరులో తొలి గేమ్‌ను ఈజీగానే గెలుచుకున్న ఈ తెలుగు తేజం.. రెండో రౌండ్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో వెనుకబడింది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ సిరీస్‌లో పీవీ సింధు తొలిరౌండ్ అదరగొట్టింది. మహిళల సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో సింధు 21-14, 8-21, 23-21తో థాయ్‌లాండ్ షట్లర్ సుపనిద కేట్థాంగ్పై గెలిచి రెండో రౌండ్‌కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ గంటకు పైగా సాగిన పోరులో తొలి గేమ్‌ను ఈజీగానే గెలుచుకున్న ఈ తెలుగు తేజం.. రెండో రౌండ్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో వెనుకబడింది.
అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆమె ఒక దశలో 8-19తో వెనుకంజలో ఉంది. ఈ స్థితిలో ఒక ప్లేయర్ వరుసగా పాయింట్లు సాధించి మ్యాచ్‌ను దక్కించుకోవడం అసాధ్యమే. కానీ సింధు మాత్రం దీనిని సుసాధ్యం చేసింది. ఆ దశలో ఏదో పూనకం వచ్చినట్టుగా ఆడిన సింధు.. వరుసగా 11 పాయింట్లు సాధించి 19-19తో స్కోర్లను సమం చేసింది. ఆ తర్వాత మూడు గేమ్పాయింట్లతో మ్యాచ్‌ను ముగించింది. కాగా పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్యసేన్ ఫస్ట్ రౌండ్‌కే నిష్క్రమించగా ఉన్నతి హుడా, దేవికా కూడా తొలిరౌండ్ విఘ్నాన్ని దాటలేకపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

