నింగ్బొ (చైనా) : బ్యాడ్మింటన్ ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో రెండో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సింగిల్స్ విభాగంలో భారత టైటిల్ ఆశలు మోస్తున్న స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫస్ట్ రౌండ్‌కే ఇంటిబాట పట్టగా ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు ఏకపక్ష విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరారు. యువ షట్లర్లు అయూశ్ శెట్టి, ఉన్నతి హుడా తమకంటే మెరుగైన ర్యాంకర్లు కల్గిన ఆటగాళ్లకు షాకిచ్చారు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 25వ ర్యాంకర్ అయూశ్.. 21-13, 21-16తో తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన వరల్డ్ నంబర్ 7 లిన్ షి ఫెంగ్ (చైనా)కు షాకిచ్చాడు.
మరో మ్యాచ్‌లో సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. 24-22, 21-12తో గుయెన్ హై డాంగ్ (వియాత్నాం)ను చిత్తుచేసి తదుపరి రౌండ్‌కు ముందంజ వేశాడు. కానీ లక్ష్యసేన్.. 12-21, 19-21తో లీ యి (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. శ్రీకాంత్ కూడా తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో సింధు.. 15-21, 21-11, 21-19తో వాంగ్ లింగ్ చింగ్ (మలేషియా)ను ఓడించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. మరో మ్యాచ్‌లో ఉన్నతి.. 23-25, 21-8, 21-18తో ప్రపంచ 11వ ర్యాంకర్ సుపనిద (థాయ్‌లాండ్)కు షాకిచ్చింది. అయితే తన్వి శర్మ, మాళవిక బన్సోద్ మొదటి రౌండ్‌కే ఇంటిబాట పట్టారు.