Peace Talks | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్, అమెరికాతో కలిసి త్రైపాక్షిక శాంతి చర్చలు జరిపేందుకు రష్యా అంగీకరించినట్టు వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
- త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
సెయింట్ పీటర్స్బర్గ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్, అమెరికాతో కలిసి త్రైపాక్షిక శాంతి చర్చలు జరిపేందుకు రష్యా అంగీకరించినట్టు వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ చర్చల్లో చైనా కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని క్రెమ్లిన్ సంకేతాలిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనలు, తదుపరి చర్చలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. పుతిన్‌తో సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడి విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ మాట్లాడుతూ.. నవంబర్ 10 తర్వాత శాంతి చర్చలను కొనసాగించేందుకు పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్పారు. అబుదాబిలో ఈ త్రైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
Peace Talks | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

