‘వారణాసి’ కథలో అదే కీలకం!
‘వారణాసి’ కేవలం భారీ యాక్షన్, సాహసాలతో కూడిన సినిమా కాదని, విడిపోయిన తండ్రీకొడుకుల బంధం చుట్టూ అల్లుకున్న ఓ భావోద్వేగ ప్రయాణం ఈ కథలో కీలకంగా ఉంటుందని చెప్పారు చిత్ర దర్శకుడు రాజమౌళి. సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉందని ఆయన వెల్లడించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
‘వారణాసి’ కేవలం భారీ యాక్షన్, సాహసాలతో కూడిన సినిమా కాదని, విడిపోయిన తండ్రీకొడుకుల బంధం చుట్టూ అల్లుకున్న ఓ భావోద్వేగ ప్రయాణం ఈ కథలో కీలకంగా ఉంటుందని చెప్పారు చిత్ర దర్శకుడు రాజమౌళి. సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉందని ఆయన వెల్లడించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల బ్రెజిల్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరైన దర్శకుడు రాజమౌళి ‘వారణాసి’ కథ గురించి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.
తండ్రీకొడుకుల అనుబంధంతో పాటు అందమైన ప్రేమకథని కూడా ఈ సినిమాలో చూస్తారని తెలిపారు. వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా నేపథ్యంలో వచ్చే ఘట్టాలు వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నారు. ‘ఇది సైన్స్ ఫిక్షన్లా అనిపించినా..పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ చిత్రం. ఆరేడు సినిమాలు ఒకే చిత్రంలో ఇమిడ్చినట్లుగా అనిపిస్తుంది. వాటన్నింటినీ కలుపుతూ భావోద్వేగభరితంగా కథను నడిపించడమే అతి పెద్ద సవాలు’ అని రాజమౌళి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

