30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
అగ్ర హీరో వెంకటేష్ అంటేనే కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఇరవైఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం-హౌస్ నంబర్ 47 (ఏకే 47)’. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, హాస్యం, యాక్షన్ కలబోతగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే సంపూర్ణ వినోదాత్మక చిత్రమిదని మేకర్స్ తెలిపారు. శ్రీనిధిశెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!