లోకం బాధను తన బాధ అనుకొని రాసే రచయితలు అరుదుగా ఉంటారు. అనుకోనిది రచయిత కె.వి.ఎస్.వర్మ ఆ కోవకే చెందుతారు. ఈ సంకలనంలో ఉన్న 21 కథల్లో విభిన్నమైన ఆలోచనలు దాగున్నాయి. తొలి కథలోనే రచయితలు రాసే కథలు, వారి నిజజీవితాలు దగ్గరగా ఉండవంటూ కవి హృదయం లోపలి కష్టాన్ని కళ్లకు కట్టాడు. ఇందులోని ‘పుట్బాల్’, ‘నీలాగే నేనూ’ కథలు ప్రత్యేకమైనవి. ‘ఫుట్బాల్’ కథలో చిన్నారి సుహాస్ కొత్త ఫుట్బాల్ కొనుక్కోవడం కోసం ఇంట్లోవాళ్లమీద ఆధారపడకుండా, కొత్తిమీర పంట సాగు చేసి దాన్ని అమ్ముకుని పైసల్ జమ చేసుకున్న వైనం పొదుపు పాఠాన్ని చెబుతుంది. ఇక ‘నీలాగే నేనూ’ కథ మరో పార్శాన్ని తాకుతుంది. కళావంతుల కుటుంబంలో పుట్టిన లలితకు పుష్పవతి కాగానే చదువు మాన్పించి కన్నెరికం చేయడంతో వేశ్యగా మారి దుర్భరమైన జీవితంలోకి అడుగుపెడుతుంది.
ఈ సందర్భంలోనే తన వద్దకు వచ్చే మగవాళ్లందరి కంటే మూర్తి ఆలోచనలు విభిన్నంగా ఉండటం… అతనితో తన జీవితాన్ని ఊహించుకుంటుంది. తన దగ్గరికి వచ్చే విటులను శరీరంలోని అన్ని భాగాలను ముట్టుకోనిచ్చినా పెదాలను మాత్రం తాకనివ్వదు. తన ప్రియుడు మాత్రమే తాకే పెదాలను కాపాడుకునే లలిత ఎంత పవిత్రురాలో రచయిత ఆవిష్కరిస్తారు. ఈ రెండు హృద్యమైన కథలు నమస్తే తెలంగాణ ముల్కనూర్ కథల పోటీల్లో బహుమతులు పొందడం విశేషం. ‘అనుకోనిది’ కథలో ఆనందంగా సాగిన సంసారంలో అనుకోని అవాంతరం యాసిడ్ రూపంలో ఎదురవుతుంది. చివరికి సుదర్శన్, నర్మదల సంసారాన్ని సుఖాంతం చేయడం పాఠకుడికి తృప్తినిస్తుంది. ఒకే జీవితంలో కష్టసుఖాలు ఇమిడి ఉన్నట్టుగా.. ప్రతి కథలో విభిన్న కోణాలను పరిచయం చేశాడు రచయిత.
రచయిత: కె.వి.ఎస్ వర్మ , పేజీలు: 179, ధర: రూ.200
ప్రతులకు: అనల్ప బుక్స్, 35-69/1, మొదటి అంతస్తు, జి.కె కాలనీ బస్టాప్ పక్కన, నేరేడ్మెట్ చౌరస్తా దగ్గర,
సికింద్రాబాద్
-రాజు పిల్లనగోయిన
రచన : ఉమ్మడిసింగు రాఘవరావు
పేజీలు : 72;
ధర : రూ.100
ప్రచురణ : మానస ఆర్ట్ థియేటర్స్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 92471 08893
రచన : రాజేందర్ ‘జింబో’
పేజీలు : 130;
ధర : రూ.150
ప్రచురణ : ప్రోజ్ పోయెట్రీ ఫోరం
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94404 83001