ఇంచియోన్: మరికొద్దిరోజుల్లో మొదలుకానున్న ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు దక్షిణ కొరియాలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ కార్లొస్ అల్కరాజ్.. తన ప్రియమైన ప్రత్యర్థి యానిక్ సిన్నర్ (ఇటలీ)పై పైచేయి సాధించాడు.
ఇరువురి మధ్య ఇంచియోన్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఈ నయా స్పెయిన్ బుల్.. 7-5, 7-6 (6)తో సిన్నర్‌పై విజయం సాధించాడు. సుమారు 12 వేల మంది ప్రేక్షకుల నడుమ జరిగిన మ్యాచ్ సుమారు గంటా 47 నిమిషాల పాటు అభిమానులను అలరించింది.