స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామర్ బ్యూటీ రష్మిక మంధాన ప్రధాన పాత్రలలో లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారు అనే దానిపై కొన్నాళ్లుగా ఆసక్తికర చర్చ నడుస్తుంది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఎవరు ఊహించని పేరుని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమా శేషాచల అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం, దానికి సంబంధించిన స్మగ్లింగ్‌పై ‘రూపొందుతోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ను కేరళ, మారేడు మిల్లి, రంపచోడవరంలోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇప్పుడు తెన్‌కాశీలో చిత్రీకరణ జరుగుతుంది అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్ట్ 13న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Welcoming #FahadhFaasil on board for the biggest face-off 😈@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie #VillainOfPushpa #Pushpa
— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2021
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/ndweB09rXi