‘లోకం మీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది..ఇక్కడ ఎవడి యుద్ధం వాడిదే’ అంటూ ధిక్కార స్వరంతో పోరుకు సిద్ధమవుతున్నాడు పుష్పరాజ్. అడవి తన ఆస్థానమని, ఇక్కడ మరొకరికి స్థానమే లేదని హెచ్చరిస్తున్నాడు. అతని జీవన పోరాటాన్ని, శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్ ఆసాంతం రోమాంచిత, భావోద్వేగభరితమైన ఘట్టాలతో ఆకట్టుకుంటున్నది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. స్మగ్లర్ పుష్పరాజ్‌గా ఊరమాస్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టాడు.
సీమ గ్రామీణ యాసలో ఆయన సంభాషణలు, రగ్గ్డ్ లుక్స్ హైలైట్‌గా నిలిచాయి. నాయకానాయికలు అల్లు అర్జున్, రష్మిక మందన్న మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సహజత్వంతో సాగాయి. చివర్లో ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా..ఫైర్ అంటూ’ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ట్రైలర్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు సుకుమార్ తనదైన శైలి మేకింగ్, క్రియేటివ్ టేకింగ్‌తో కట్టిపడేశారు. మొత్తంగా సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచిందని చెప్పొచ్చు. ‘పుష్ప’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ఈ నెల 17న ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.
నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్‌ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం:దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, ఆర్ట్: రామకృష్ణ-మోనిక, సహనిర్మాతలు: ముత్తంశెట్టి మీడియా, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, దర్శకత్వం: సుకుమార్.