
‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా’ పాటలో అల్లు అర్జున్, సమంత నృత్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ పాటకు విభిన్నమైన రీతిలో కొరియోగ్రఫీని అందించి ప్రతిభను చాటుకున్నారు డ్యాన్స్‌మాస్టర్ పొలాకి విజయ్. విజేత, కొబ్బరిమట్ట, శశి, పలాస 1978 వంటి చిత్రాలతో కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. విజయ్ పొలాకి మాట్లాడుతూ “పలాస 1978’లో ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట నృత్యదర్శకుడిగా నాకు మంచి పేరుతెచ్చిపెట్టింది.
‘పుష్ప’లో నేను కంపోజ్ చేసిన డ్యాన్సులు అల్లు అర్జున్, సమంతను మెప్పించడం ఆనందంగా ఉంది. హీరోఇమేజ్కు అనుగుణంగా నవ్యతకు ప్రాధాన్యతనిస్తూ నృత్యాలను సమకూర్చడానికే ప్రయత్నిస్తా. ప్రస్తుతం ‘హీరో’, ‘నరకాసుర’తో పాటు మరికొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నా’ అని తెలిపారు.