చండీగఢ్: పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసీవాలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సమక్షంలో సిద్ధూ మూసీవాలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింగర్ సిద్ధూ మూసీవాలా మాట్లాడుతూ.. పంజాబీల గళం దేశమంతటా వినిపించడానికే తాను కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు.
పంజాబ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వివిధ రంగాల్లో ప్రముఖులుగా పేరు సంపాదించిన వాళ్లను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. అంతేగాక పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు చేస్తున్నారు.
Chandigarh | Punjabi singer Sidhu Moosewala joins the Congress party, says, "One of the reasons to join Congress is to raise the voice of Punjabis." pic.twitter.com/hdRec57jh1
— ANI (@ANI) December 3, 2021