న్యూయార్క్: అమెరికా ఎఫ్‌బీఐ(FBI) వాంటెడ్ జాబితాలో ఓ పంజాబీ పోలీసు ఆఫీసర్ ఉన్నారు. ఆపరేషన్ హార్డ్ బాల్ పేరుతో అమెరికా ఓ ఆపరేషన్ నిర్వహించింది. ఇండియా నుంచి నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో ఆ ఆపరేషన్ చేపట్టారు. అయితే మొత్తం 37 మంది భారతీయ నేరస్థులను వాంటెడ్ లిస్టులో అమెరికా చేర్చింది. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, భగవాన్‌పురియా కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఓ మర్డర్ కేసులో పోలీసు ఆఫీసర్ గురిందర్జీత్ సింగ్ అమెరికాలోని ఓ బాధిత కుటుంబం నుంచి సుమారు నాలుగు లక్షల డాలర్లు వసూల్ చేసినట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో యూఎస్ అటార్నీ ఫస్ట్ అసిస్టెంట్ బిల్ ఎస్సేలీ ఈ విషయాన్ని తెలిపారు.
జగ్గూ భగవాన్పురి క్రిమినల్ సిండికేట్ కేసులో ఓ పంజాబ్ పోలీసు అధికారి బెదిరింపు వసూళ్లకు పాల్పడిన్టలు ఆరోపించారు. ఎఫ్‌బీఐ సుమారు 37 మంది భారతీయ నేరస్థులపై అభియోగాలు నమోదు చేసింది. అమెరికాలో ఉన్న బాధిత కుటుంబం నుంచి ఆ ఆఫీసర్ నాలుగు లక్షల డాలర్లు వసూల చేసినట్లు తెలిపారు. ఆ డబ్బులు ఇవ్వకుంటే ఇండియాలో ఉన్న కుటుంబంపై మర్డర్ కేసు పెట్టనున్నట్లు ఆ పోలీసు బెదిరించారన్నారు. అయితే ఈ కేసులో ఆ పోలీసు అధికారిని అమెరికాకు అప్పగించాలని కోరనున్నట్లు చెప్పారు.