Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Punjab : పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త పర్విందర్ సింగ్ జోటా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన నిందితుడి ఇంటిని ప్రభుత్వం కూల్చేసింది.
Punjab : పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త పర్విందర్ సింగ్ జోటా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన నిందితుడి ఇంటిపై పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యకు దిగింది. నిందితుడు అశ్వని కుమర్ ఇంటిని ప్రభుత్వం కూల్చేసింది. అతడి మెడికల్ షాపును నిరసనకారులు తగులబెట్టేశారు. పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త పంజాబ్‌లోని పర్విందర్ సింగ్ జోటా మంగళవారం మాన్సా జిల్లాలో హత్యకు గురయ్యాడు.
అది కూడా ఫేస్బుక్ లైవ్‌లో ఈ ఘటన జరిగింది. ఒక మెడికల్ షాపులో డ్రగ్స్ విక్రయిస్తుండటాన్ని పర్విందర్ ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మెడికల్ షాపు ఓనర్ అశ్వని కుమార్ తన దగ్గరున్న పిస్టల్‌తో పర్విందర్ సింగ్‌ను కాల్చి చంపాడు. ఇది లైవ్ స్ట్రీమింగ్‌లో జరిగింది. ఈ ఘటన అనంతరం నిందితుడు అశ్వని కుమార్ పారిపోయాడు. పోలీసులు పర్విందర్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ హత్యపై పెద్దపెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీసులు వేగంగా స్పందించారు.
బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం బుల్డోజర్ చర్యకు దిగింది. అతడి ఇంటిని ప్రభుత్వం బుల్డోజర్తో కూల్చేసింది. ఇదే సమయంలో ఈ ఘటన జరిగిన మెడికల్ షాపు వద్ద పలువురు ఆందోళనకారులు అతడి మెడికల్ షాపును, పరిసరాల్ని తగులబెట్టేశారు. ఇదే సమయంలో మెడికల్ షాపు నుంచి నిషేధిత ఔషధాల్ని కూడా ఆందోళనకారులు గుర్తించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

