Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
Harish Rao | కర్ణాటకలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పాలమూరు దళిత బాధితులకు తక్షణమే ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు.
గద్వాల / పాలమూరు: కర్ణాటకలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పాలమూరు ( Palamuru ) దళిత బాధితులకు తక్షణమే ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని (Compen sation) అందించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.
కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించడంతో తాము ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి పూర్తిస్థాయి వైద్యం అందించడంతోపాటు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు, ప్రమాద తీవ్రతను బట్టి బాధితులందరికీ తగిన పరిహారం అందించాలని కోరారు. కొందరు బాధితులకు సరైన వైద్యం అందక, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం విచారకరమని విమర్శించారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా వ్యవసాయానికి, విత్తనోత్పత్తికి ప్రసిద్ధి చెందిందని హరీష్రావు గుర్తుచేశారు. వివిధ రకాల విత్తన పంటల సాగుతో పాటు విత్తన కంపెనీల ద్వారా స్థానికులకు ఉపాధి లభించేదని చెప్పారు.
గతంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు వంటి పథకాలతో వ్యవసాయానికి అండగా నిలిచామని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక, స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గడంతో కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి అవసరమైన నీటిని సమర్థవంతంగా అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.
విద్యుత్ సరఫరా, మోటార్ల నిర్వహణలో లోపాల వల్ల చివరి ఆయకట్టు భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే వ్యవసాయం చేసుకుంటూ గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించాలని, వలసలను అరికట్టేందుకు ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

