యాదాద్రి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు రోజు కావడంతోపాటు దసరా పండుగ ముగిసిన నేపథ్యంలో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి కొండ సందడి గా మారింది. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టింది. శ్రీవారి ఖజానాకు రూ.20,31,973 ఆదాయం సమకూరిందని ఈవో ఎన్ గీత తెలిపారు. – యాదాద్రి