ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. జర్నలిస్టు నవికా కేసులన్నీ ఢిల్లీకి బదిలీ
Navika Kumar: మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో టీవీ యాంకర్ నవికా కుమార్‌పై కూడా దేశంలోని పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోలో నవికా కుమార్ యాంకర్. ఈ నేపథ్యంలో నమోదు అ
న్యూఢిల్లీ: మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో టీవీ యాంకర్ నవికా కుమార్‌పై కూడా దేశంలోని పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోలో నవికా కుమార్ యాంకర్. ఈ నేపథ్యంలో నమోదు అయిన కేసుల్నీ ఒకే చోటుకు బదిలీ చేయాలని నవికా సుప్రీంను ఆశ్రయించింది. ఇవాళ ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. నవికాపై ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా, కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 8 వారాల పాటు నవికా కుమార్‌పై ఎటువంటి చర్యలు తీసుకోరాదు అని కూడా కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేసుల కొట్టివేత విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా నవికా కుమార్‌కు సుప్రీం అవకాశం కల్పించింది. ఢిల్లీ పోలీసుశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజీ ఆపరేషన్స్(ఐఎఫ్ఎస్వో) ఈ కేసులో విచారణ చేపడుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

