హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)లో పనిచేస్తున్న పలువురికి ఉద్యోగోన్నతులకు డీపీసీ ఆమోదించిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, టీజీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సీ హరికిరణ్ తెలిపారు. అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 ఆఫీసర్స్‌గా 34 మందికి ఉద్యోగోన్నతులు కల్పించారు. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1గా ఇద్దరికి, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌కు గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1గా ఒకరికి ప్రమోషన్ కల్పించారు.
ఫార్మసీకి డిమాండ్ 96శాతం సీట్ల భర్తీ.. శ్రీదేవసేన
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కూడా ఫార్మసీ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది బీఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో 95శాతం సీట్లు నిండాయి. ఈ మేరకు ఎప్‌సెట్ (బైపీసీ) తుది విడుత సీట్లను మంగళవారం కేటాయించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. కేవలం 399 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈఎస్ఏ పరీక్షల నుంచి బాహ్య మూల్యాకనం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బాహ్య మూల్యాంకనం (ఎక్స్టర్నల్ వాల్యుయేషన్) విషయంపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. అక్టోబర్‌లో జరుగనున్న సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షల నుంచే బాహ్య మూల్యాంకనం అమలు చేయాలని స్పష్టంచేసింది. పరీక్షలు పాఠశాల స్థాయిలోనే జరుగుతాయని పేర్కొన్నది. పరీక్ష పూర్తైన రోజే హెచ్ఎంలు జవాబుపత్రాలను ఎమ్మార్సీకి పంపాలని, ఎంఈవోలు వాల్యుయేటర్లను నియమించి మూల్యాంకనం పూర్తిచేయాలని సూచించింది.